Friday, November 22, 2024

AP | రిజిస్ట్రేషన్ల శాఖకు ఆధునిక సాంకేతికత.. ఆన్‌లైన్‌లోనే డాక్యుమెంట్ల తయారీకి అవకాశం

అమరావతి, ఆంధ్రప్రభ : స్టాంప్‌ ఆండ్‌ రిజిస్ట్రేషశాఖ సరికొత్త హంగులను సంతరించుకుంది. ఏపీలో కొత్త రిజిస్ట్రేష్రన్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. పెరిగిన ప్రజల అవసరాలకు అనుగుణంగా క్రయ విక్రయ దారులకు రిజిస్ట్రేషన్‌ సేవలను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాత కంప్యూటర్‌ వ్యవస్థకు బదులుగా ఆధునిక సాంకేతికతను రూపొందించడంతో పాటు, సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్ల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ మేరకు సీఏఆర్డీ 2.0ను అమలులోకి తెచ్చింది. సీఏఆర్డీ 2.0 సాప్ట్‌n వేర్‌ ను రూపొందించింది.దీని ద్వారా ప్రజలు ఇకపై నేరుగా ఆన్‌లైన్‌ లో దస్తావేజులు తయారు చేసుకునే వెసులుబాటుతో పాటు స్లాట్‌ బుకింగ్‌ అవకాశం కల్పించింది. దీంతో వినియోగదారులే వివరాలు నమోదు చేసుకుని ఫీజు చెల్లించుకునేలా కొత్తవిధానంలో వెసులుబాటు కల్పించింది. రిజిస్ట్రేష్రన్‌ ప్రక్రియ పూర్తయిన 20 నిమిషాల్లోనే దస్తావేజులు అందనున్నాయి.

కాగా ఈ కొత్త రిజిస్ట్రేష్రన్‌ విధానం గత నెల 15 నుంచి రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో అమలుకి రావడంతో క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లు కూడా పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ప్ర స్తుతం రిజిస్ట్రేషన్‌ శాఖలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న కార్డ్‌ 1.0 (సీఏఆర్‌డీ- కంప్యూటర్‌ ఎయిడెడ్‌ అడ్మిస్ట్రేషన్‌ ఆఫ్‌ రి జిస్ట్రేషన్‌ డిపార్ట్‌ మెంట్‌) వెర్షన్‌ను 1999లో రూపొందించారు. దీంతో ప్రస్తుతం పెరిగిన ప్రజల అవసరాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ సేవల వేగవంతంగా జరగడం లేదు.

- Advertisement -

అంతే కాదు ప్రతి విషయానికి దళారులు, దస్తావేజులేఖరులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రిజిస్ట్రేషన్‌ ఫీజు కంటే అధికారులను ఇచ్చే ఫీజు ఎక్కువగా ఉండటంతో క్రయ విక్రయదారులకు రిజిస్ట్రేషన్లు భారంగా మారింది. ఇటీవల ప్ర భుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా ప్రయోగాత్మకంగా కొన్ని రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే ఈ ప్రక్రియను ప్రారంభించారు.

దీంతో కొత్త విధానం ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు, క్రయ విక్రయదారులకు ఇబ్బందులు తప్పడంతో ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ ప్రక్రియను అమలు చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానం పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాగా, ఇప్పటి వరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకొని పని చేస్తున్న దస్తావేజులేఖరులు మాత్రం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంతో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని భావించి ఆందోళనలు చేసినప్పటికీ ప్రభుత్వం వారి ఆందోళన తోసిపుచ్చుకురావడం గమనార్హం.

అయితే ఇదిలా ఉండగా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినా అక్కడక్కడ దళారుల తాకిడి మాత్రం ఆగడం లేదు. క్రయ విక్రయ దారులకు మాయమాటలు చెప్పి కొందరు దళారులు తమ గుప్పెట్లో పెట్టుకొని పని కానిచ్చేస్తున్నారు. దళారులతో పాటు, సంపాదన పైన యావ తగ్గని అధికారులు కూడా దళారుల మాటలకే చెల్లుబాటు చేస్తూ.. గత విధానాన్నే తెరమీదకు తీసుకొస్తున్నారు.

గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ సేవలు !

రిజిస్ట్రార్‌ కార్యాలయాలతో పాటు, సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం తీసుకొచ్చింది. తాజాగా 2,526 గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. రీ సర్వే పూర్తయి, ఎల్‌పీఎం (ల్యాండ్‌ పార్సిల్‌ నంబర్‌) వచ్చిన గ్రామాల్లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ విధానంలో కీలక మార్పులు తెచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానం ద్వారా ప్రజలు ఎవరికి వారు నేరుగా ఆన్‌లైన్‌లో దస్తావేజులు తయారు చేసుకునేలా కొత్త విధానాన్ని రూపొందించారు.

అంతే కాదు ఈ విధానంలో ఆధార్‌ లింకుతో రిజిస్ట్రేషన్‌ సేవలను అనుసంధానం చేయడం ద్వారా అసలు వ్యక్తులు లేకుండా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరగదు. ఆధార్‌ కార్డులో ఉన్న బయోమెట్రిక్‌ వివరాలతో సరిపోల్చుతారు. ఈకైవైసీ కూడా పూర్తి చేస్తారు. ఈ విధానంలో రిజిస్ట్రే షన్‌ కోసం ముందుగా ఐజీఆర్‌ ఎస్‌- ఆంధ్రప్రదేశ్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కాగానే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.ఆ ఓటీపీని నమోదు చేసి సైట్‌లోకి వెళ్లి.. దరఖాస్తులో ఆస్తుల వివరాలు, సర్వే నెంబర్‌, లింక్‌ డాక్యుమెంటు నెంబర్‌, ఇతర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

అంతే కాదు ఆయా ఆస్తులకు సంబంధించి పూర్తి దస్తావేజులు స్కాన్‌ చేసి ఆప్‌ లోడ్‌ చేయాలి. అలాగే రిజిస్ట్రేషన్‌ ఛార్జీ ల వివరాలు కూడా నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. క్రయ విక్రయాలకు సంబంధించిన వారి ఫోటోలను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే తీస్తారు. ఇదిలా ఉండగా, గ్రామ స్థాయిలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరిగే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రయోగాత్మకంగా 51 గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రెండో దశలో 1500 గ్రామ సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు మళ్లీ 2,526 గ్రామ సచివాలయాల్లో ఈ సేవలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement