తండ్రి మందలించడంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోటుచేసుకుంది. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లిలో తండ్రి మందలించడంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నీలిమాదేవి (23) బలవన్మరణానికి పాల్పడింది. తండ్రి కోపగించుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement