Saturday, November 23, 2024

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల ర‌ద్దీ .. శ్రీవారి దర్శనానికి 48 గంటలు

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. పెరటాసి మాసం మూడో శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం క్యూలైన్లు గోగర్భం డ్యామ్ వద్దకు చేరుకున్నాయి. దీంతో తిరుమలకు వచ్చే భక్తుల దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. భక్తులు తమవంతు వచ్చే వరకు సంయమనంతో ఉండాలని టీటీడీ కోరింది. భక్తులు తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయాల్లో విశ్రాంతి తీసుకుని ఉదయం క్యూలైన్లలోకి ప్రవేశించాలని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement