Thursday, October 17, 2024

AP | బిరబిరా పరుగులెడుతున్న కృష్ణమ్మ..

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ స్మార్ట్ : గత పది రోజులుగా కర్ణాటక పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కృష్ణ ఉప్పనదులైన మలప్రభ, ఘటప్రభ, తుంగభద్ర, వంటి ఉపనదులు పొంగి ప్రవహించడంతో కృష్ణా నదికి భారీగా వరద ప్రవాహం పోటెత్తుతుంది. గురువారం సాయంత్రం అందిన సమాచారం మేరకు శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుకుంటుంది. ముఖ్యంగా తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు నుంచి 2.54 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది.

దీంతో కృష్ణమ్మ పరవళ్లుతొక్కుతూ శ్రీశైల మల్లన్న చెంతకు చేరుతుంది. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం మేరకు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను, వరద ప్రవాహంతో 855.20 అడుగులకు చేరుకుంది. శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థం 215 టిఎంసిల గాను ప్రస్తుతం 92,4860 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.

ప్రస్తుతం.. ప్రాజెక్టుకు 2,54,700 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరుతుంది. ఇందులో జూరాల నుంచే 2.51,697 క్యూసెక్కులు చేరుతుండగా, ఇక సుంకేసుల నుంచి 2095 క్యూసెక్కులు శ్రీశైలం చేరుకుంటుంది. కర్ణాటక ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు నమోదు కావడంతో ఆలమట్టి తో పాటు నారాయణపూర్ ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి.

దీంతో ఆయా డ్యాముల ‘గేట్లను తెరిచి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక జూరాల వద్ద విడుదలైన నీరు శ్రీశైల జలాశయంకు చేరుకోవాలంటే కనీసం 36 గంటలు నుంచి 40 గంటల వరకు సమయం పడుతుందని డ్యాం ఎస్ఇ శ్రీరామమూర్తి తెలిపారు. రాత్రికి శ్రీశైలం డ్యామ్ కు ఇన్ ఫ్లో మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. మొత్తంగా పశ్చిమ కనుమల్లో కురిసిన వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ మల్లన్న చెంతకు చేరుతుంది.

ఉప్పొంగుతున్న తుంగభద్ర…

- Advertisement -

కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల మూలంగా తుంగభద్ర కు జల కళ ఉట్టిపడుతుంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులకు గాను, ప్రస్తుతం 1632:20 అడుగులుగా ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో 81030 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో జలాశయంలో 105 టీఎంసీల నిల్వలకు.

ప్రస్తుతం 102,576 టీఎంసీల నీరు విల్వ ఉండడం విశేషం. ఇదే క్రమంలో తుంగభద్ర జలాశయం నుంచి 71262 క్యూసెక్కుల నీరు 20. గేట్ల ద్వారా దిగువకు విడుదలవుతుంది. వీటితోపాటు తుంగభద్ర కింద, కాలువలకు 4995 విడుదలవుతుంది. ఇదే సమయంలో కర్నూలు జిల్లాలో సుంకేసుల బ్యారేజీ వరద నీరు వచ్చి చేరుతుంది, ప్రస్తుతం సుంకేసులు బ్యాలేజీ లో 1:20 టీఎంపీలకు గాను 0.80 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రస్తుతం తుంగభద్ర జలాశయం నుంచి గత మూడురోజులుగా నీటిని విడుదల చేయగా, సుమారు 3వేల క్యూసెక్కుల నీరు గురువారం మధ్యాహ్నం. సుంకేసులకు చేరుకుంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా సుంకేసుల బ్యారేజ్ నుంచి దిగువ నదిలోకి విడుదలవుతుంది. ఇక తుంగభద్ర డ్యాం నుంచి విడుదలయ్యే నీరు రెండు,మూడు రోజులకు సుంకేసుల కు చేరే అవకాశం ఉంది. దీంతో తుంగభద్ర తీరం కింద రెడ్ అలర్డును ప్రకటించారు, ప్రజలు ఎవరూ నదిలోకి వెళ్లకుండా రెవెన్యూ అధికారులు చాటింపులు వేయించడం విశేషం

Advertisement

తాజా వార్తలు

Advertisement