Tuesday, November 26, 2024

AP | అనూహ్యంగా పెరిగిన అమ్మవారి ఆదాయం.. 16 రోజులకు మూడున్నర కోట్లు

ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో : ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కనకదుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో కనకదుర్గమ్మ ఆలయానికి మునుపెన్నడూ లేని విధంగా అనూహ్య రీతిలో ఆదాయం పెరుగుతుంది. గడిచిన 16 రోజుల్లో అమ్మవారి ఆలయానికి సుమారు మూడున్నర కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అమ్మవారికి రోజుకు సగటున 21 లక్షల రూపాయల ఆదాయం భక్తుల నుంచి సమకూరుతోంది.

ఆలయంలోని హుండీలను గురువారం మహా మండపం ఆరో అంతస్తులో కెఎస్ రామారావు సమక్షంలో సిబ్బంది లెక్కించారు. ఈ హుండీ లెక్కింపులో భాగంగా 16 రోజుల అమ్మవారి ఆదాయం నగదు రూపంలో రూ.3,23,75,523/- గా ఉంది. అంటే భక్తుల నుంచి రోజుకు సగటున రూ.20,23,470/- ఆదాయం వస్తుంది. ఇక‌ 694 గ్రాముల బంగారం, 264 గ్రాముల 6 కిలోల వెండిని భక్తులు కానుకగా హుండీ ద్వారా సమర్పించారు.

భక్తులు విదేశీ కరెన్సీ యూఎస్ఏ 516 డాలర్లు, ఆస్ట్రేలియా 100 డాలర్లు, కొరియా 1000 వాన్, ఇంగ్లాండ్ 40 పౌండ్లు, ఒమన్ 100 బిమ్సా, కెనడా 15 డాలర్లు, యూఏఈ 25 దిర్హామ్‌లు, కువైట్ 1 దినార్, ఖతార్ 24 రియాల్స్, సింగపూర్ 2 డాలర్లు కానుకలుగా చెల్లించారు. ఆన్‌లైన్ ఈ హుండీ ద్వారా భక్తులు రూ.59,380/- చెల్లించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement