Monday, November 11, 2024

TTD | శ్రీవారి లడ్డూల నాణ్యత తగ్గిందేలే.. !

తిరుమల : తిరుమల వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదమైన లడ్డూ నాణ్యతలో ఎటువంటి లోపం ఉండే అవకాశం లేదని శ్రీవారి ఆలయ పోటులో పనిచేస్తున్న వైష్ణవ బ్రాహ్మణులు స్పష్టం చేశారు. ఇటీవలి డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో లడ్డూ నాణ్యతకు సంబంధించి పలువురు భక్తులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని టీటీడీ అధికారులు పోటు సిబ్బందితో తిరుమల వైభవోత్సవ మండపంలో ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఆ సందర్బంగా వారు మాట్లాడుతూ… నాణ్యత విషయంలో ఎలాంటి రాజీకి తావు లేకుండా దిట్టం మేరకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాలు తయారు చేస్తున్నామన్నారు. తాము కొన్ని తరాలుగా పారంపర్యంగా లడ్డూ తయారీలో నైపుణ్యం సాధించామని చెప్పారు. లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి, శనగపిండి, చక్కెర ఎండు ద్రాక్ష, బాదం తదితర అన్ని దినుసులను దిట్టం ప్రకారం టీటీడీ అధికారులు అందిస్తున్నారని, వీటిని వినియోగించి నాణ్యంగా లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్నామని వివరించారు. ఈ మేరకు లడ్డూ నాణ్యత తగ్గే అవకాశం లేదని చెప్పారు. ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ శ్రీహరి, పోటు పేష్కార్ శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement