విజయవాడ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆమెకు ఘనస్వాగతం పలికారు.
విమానాశ్రయంలో పోలీసు గౌరవవందనం స్వీకరించిన అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి ఎయిమ్స్ కు రాష్ట్రపతి బయలుదేరి వెళ్లారు. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విద్యా సంస్థ (ఎయిమ్స్) స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
- Advertisement -