అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని వివిధ పాలి-టె-క్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్- 2022 ప్రవేశ పరీక్ష ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రశాంతంగా జరిగినట్లు స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చైర్మన్, కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. పాలిసెట్‌కు మొత్తం లక్షా 38 వేల 189 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా వారిలో లక్షా 31 వేల 627(95.25 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారని ఒక ప్రకటనలో వివరించారు. 85 వేల 852 మంది బాలురు పరీక్షకు నమోదు చేసుకోగా, 82 వేల 339(95.91 శాతం) మంది, 52 వేల 337 మంది బాలికలకు 49 వేల 288(94.17 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.
మొత్తం 404 పరీక్షా కేంద్రాలలో కలెక్టర్లు, పోలీస్ శాఖ, వైద్యారోగ్య, విద్యుత్, రవాణా శాఖ తదితర ప్రభుత్వ శాఖల సహకారంతో పరీక్ష సజావుగా జరిగినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కల్లెక్టర్లకు, రెవెన్యూ సిబ్బందికి ఇతర శాఖల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ప్రశ్నాపత్రం ప్రాథమిక కీని జూన్ రెండో తేదీ నుంచి ఎస్‌బీటీఈటీ వెబ్‌సైట్‌లో స్క్రీన్స్, నోటిఫికేషన్స్ ద్వారా పొందవచ్చన్నారు. ఫలితాలను జూన్ 10వ తేదీలోగా విడుదల చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..