Friday, November 22, 2024

రోడ్డుపై సభకు నో చెప్పిన పోలీసులు.. స్టూల్ పై నిలబడి లోకేష్ నిరసన  

గంగాధర నెల్లూరు (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : రోడ్డుపై సభ నిర్వహించరాదని పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ నేత‌ నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిలిపివేసిన లోకేష్ స్టూల్ పై నిలబడి నిరసన తెలిపిన‌ ఘటన గురువారం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. యాత్రలో భాగంగా చిత్తూరు నుంచి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో  ప్రవేశించిన లోకేష్ యాత్ర మొదలు పెట్టారు. సంసిరెడ్డి పల్లె వద్ద రోడ్డుపై గుమీకూడిన జనాన్ని ఉద్దేశించి మాట్లాడేందుకు లోకేష్ సిద్దమ‌య్యారు.. అక్కడకు చేరుకున్న పోలీసులు అనుమతి లేకుండా రోడ్డుపై సభ నిర్వహించ రాదంటూ లోకేష్ ప్రసంగం కోసం ఏర్పాటు చేసిన మైక్ ను లాక్కున్నారు..

లోకేష్ నిలబడేందుకు రెడీ చేసిన స్టూల్ ను తొలగించడానికి యత్నించారు.. వారి ప్రయత్నాన్ని నివారించిన లోకేష్ ఇది సభ కాదని, నడి రోడ్డు కాదని, అయినా రాజ్యాంగం కల్పించిన హక్కును ఎలా అడ్డుకుంటారని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఆ గ్రామ ప్రజల్లో కొందరు మా గ్రామానికి వచ్చి మాతో మాట్లాడటం తప్పేముందని పోలీసులను నిలదీశారు. అయినా వినని పోలీసుల వైఖరికి నిరసనగా చేతిలో రాజ్యాంగం పుస్తకం పట్టుకొని రోడ్డుపై స్టూల్ ఉంచి దానిపై ఎక్కి నిలబడి నిరసన తెలియ చేయడం మొదలు పెట్టారు. ఈ విషయం తెలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement