అమరావతి, ఆంధ్రజ్యోతి: 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్లో జరగనున్న పదో తరగతి పరీక్షల్లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు పాస్ మార్కులు 25గా ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఉన్న పాస్ మార్కులను 35 నుంచి పది మార్కులకు తగ్గించారు.
ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానంద రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మానసిక ప్రవర్తన, మేధో వైకల్యం ఉన్న విద్యార్థులకు రాయితీ కింద పది మార్కులు తగ్గించినట్లు పేర్కొన్నారు.