కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పి కారు బావిలోకి దూసుకుపోయిన. కోడుమూరుకి చెందిన రామాంజనేయులు (25) అనే వ్యక్తి కారులో ఆలూరులో తమ బంధువులను వదిలి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. రామాంజనేయులు స్వయంగా డ్రైవింగ్ చేస్తూ తిరిగి కోడుమూరుకు బయలుదేరాడు. ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామం సమీపంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో కారు అదుపుతప్పి వేగంగా మద్దిలేటి నాగన్న అనే వ్యక్తికి చెందిన పొలంలోకి దూసుకుపోయి పక్కనే ఉన్న బావిలో పడింది. ఇది గమనించిన స్థానిక ప్రజలు.. పోలీసులకు కాల్ చేసి సమాచారం అందించారు. రూరల్ సీఐ బిఏ మంజు. యస్ఐ సునీల్ కుమార్, పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
బావిలో నీరు ఎక్కువగా వుండటంతో.. కారు కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత
జేసీబీ, తాళ్ల వినియోగంతో కారును వెలికి తీశారు. ప్రమాద సమయంలో కారు పడిన బావి రోడ్డుకు 30 అడుగుల దూరంలో ఉండటం గమనార్హం. అతి వేగం కారణంగానే కారు బావిలో పడినట్లు స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం కారు పడ్డ బావిలోంచి రామాంజనేయులు మృత దేహంను మాత్రమే బయటకు తీశారు. ప్రమాదంలో ఇంకా ఎవరైనా మరణించారా.. అన్న అనుమానాలు లేకపోలేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..