అమరావతి, ఆంధ్రప్రభ : విజ్ఞాన్ యూనివర్సిటీలో బీబీఏ, ఎంబీఏ కొత్త సెషన్ ఈ నెల 29న ప్రారంభం కానున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీ కృష్ణకిశోర్ తెలిపారు. శుక్రవారం యూనివర్సిటీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంబీఏ కోర్సుతో పాటు విద్యార్థుల్లో ప్రత్యేక నైపుణ్యం, అభ్యాసాన్ని పెంపొందించేందుకు 11 విభిన్న రకాల ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
వీటిలో స్ట్రాటజీ అండ్ లీడర్ షిప్, ఫినెట్‌క్, డిజిటల్ మార్కెటింగ్, ఈ కామర్స్, డేటా సైన్స్ అనలటిక్స్, అడ్వైటైజింగ్, బ్రాండింగ్‌లో అడ్వాన్స్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు జాతీయ స్థాయిలో పోటీపడేలా శిక్షణ ఇస్తామన్నారు. బీబీఏ, ఎంబీఏ కోర్సులకు సంబంధించి ని పుణులతో శిక్షణ ఇస్తామని ప్రత్యక్షంగా ఆన్‌లైన్‌లో వారాంతపు తరగతులు కూడా నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..