Tuesday, November 26, 2024

కొత్త ఆర్థిక సంవత్సరం.. తొలి నెల లోటుతోనే ప్రారంభం

అమరావతి, ఆంధ్రప్రభ : కొత్త ఆర్థిక సంవత్సరంలో తొలి నెల లోటు-తోనే ప్రారంభమయ్యింది. ఏకంగా రూ.12 వేల కోట్లకు పైగా లోటు నమోదు కావడం విశేషం. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇబ్బందులు కలిగించే అవకాశముంది. ఆదాయం కన్నా వ్యయం భారీగా ఉండడంతో ఈ లోటు నెలకొంది.

ఏప్రిల్‌లో కేవలం రూ.8,147 కోట్లు ఆదాయం రాగా, వ్యయం మాత్రం ఏకంగా రూ.20,320 కోట్లు రికార్డు అయినట్లు తేలింది. దీంతో రూ.12,173 కోట్లు లోటుగా ఉన్నట్లు తేలింది. ఏప్రిల్‌లో సెక్యూరిటీ వేలం ద్వారా ఆరువేల కోట్లను రుణంగా తీసుకున్నారు. అయినప్పటికీ ఇంత లోటు నెలకొనడం గమనార్హం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement