Sunday, November 10, 2024

ఏపీలో ప్రతిపాదిత కొత్త జిల్లాలు.. వాటి రాజధానులు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఇవ్వాల‌ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఉగాది నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో.. ఏయే పేర్లతో వాటిని ఏర్పాటు చేయబోతున్నారన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాటి పేర్లను విడుదల చేసింది. వీటిలో అల్లూరి సీతారామరాజు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి వంటి పేర్లు కూడా ఉన్నాయి.

జిల్లా పేరు.. రాజ‌ధాని పేరు
శ్రీకాకుళం – శ్రీకాకుళం
విజయనగరం – విజయనగరం
మన్యం జిల్లా – పార్వతీపురం
అల్లూరి సీతారామరాజు – పాడేరు
విశాఖపట్టణం – విశాఖపట్టణం
అనకాపల్లి – అనకాపల్లి
తూర్పుగోదావరి – కాకినాడ
కోనసీమ – అమలాపురం
రాజమహేంద్రవరం – రాజమహేంద్రవరం
నరసాపురం – భీమవరం
పశ్చిమ గోదావరి – ఏలూరు
కృష్ణా – మచిలీపట్నం
ఎన్‌టీఆర్ జిల్లా – విజయవాడ
గుంటూరు – గుంటూరు
బాపట్ల – బాపట్ల
పల్నాడు – నరసరావుపేట
ప్రకాశం – ఒంగోలు
ఎస్‌పీఎస్ నెల్లూరు – నెల్లూరు
కర్నూలు – కర్నూలు
నంద్యాల – నంద్యాల
అనంతపురం – అనంతపురం
శ్రీ సత్యసాయి జిల్లా – పుట్టపర్తి
వైఎస్సార్ కడప – కడప
అన్నమయ్య జిల్లా – రాయచోటి
చిత్తూరు – చిత్తూరు
శ్రీ బాలాజీ జిల్లా – తిరుపతి

Advertisement

తాజా వార్తలు

Advertisement