రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా (చీఫ్ సెక్రటరీ) బాధ్యతలు స్వీకరించిన విజయానంద్ ఐఏఎస్.. ఈరోజు సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయానంద్‌కు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. వారి అనుభవం రాష్ట్రాభివృద్ధికి, సుపరిపాలన అందించేందుకు ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు.
అదే విధంగా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ నిరబ్ ప్రసాద్ కుమార్ ఐఏఎస్.. ఈరోజు సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా నిబద్ధతతో అంకితభావంతో సేవలందించిన ఆయనను పవన్ కల్యాణ్ అభినందించారు.