Saturday, November 23, 2024

గృహ వినియోగ ఖర్చులపై సర్వే నిర్వహించనున్న నేషనల్‌ స్టాటిస్టికల్‌ కార్యాలయం..

అమరావతి, ఆంధ్రప్రభ: దేశ వ్యాప్తంగా పలు సామాజిక ఆర్ధిక అంశాలపై సర్వేలు చేపట్టడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అభివృద్ధి పథకాలు, ప్రజల స్థితిగతుల అవగాహన కోసం అవసరమైన సమాచారాన్ని సేకరించేలా కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (క్షేత్రస్థాయి కార్యక్రమముల విభాగం) సర్వే నిర్వహించనుంది. ఈ సంస్థ చేపట్టే సర్వేలో భాగంగా గృహ వినియోగపు ఖర్చుల సర్వే ఆగష్టు 1వ తేదీ నుంచి ఏడాదిపాటు జరగనున్నట్లు డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌. కిరణ్‌ కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వేలో ఆహారం, వస్తువులు, వివిధ సేవలపై కుటు-ంబాలు చేసిన ఖర్చుల వివరాలు సేకరించి తద్వారా ప్రజల జీవన ప్రమాణ స్థాయి, సామాజిక వినియోగం, అభివృద్ధి, అసమానతలు తెలిపే గణాంక సూచికలు తయారు చేయడం జరుగుతుందని వెల్లడించారు.

ప్రణాళిక సంఘం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలు ఈ సర్వే సమాచారాన్ని పేదరిక విస్తృతిని అంచనా వేయడానికి, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఆహారం, వస్తువులు, సేవల వినియోగిత, వాటి నిష్పత్తి, తలసరి ఖర్చులు, జీవన ప్రమాణ స్థాయిలు అంచనా వేయడానికి ఉపయోగిస్తారని వివరించారు. ఈ సర్వే కోసం విజయవాడలోని రాజ్‌ టవర్స్‌లో ఈ నెల 25 నుంచి 27 వరకు 3 రోజుల శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. శిక్షణా తరగతులకు ఢిల్లి నుంచి అదనపు డైరెక్టర్‌ జనరల్‌ డా. బివాస్‌ చౌదరి, డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌. కిరణ్‌ కుమార్‌ హాజరవుతారని తెలిపారు. శిక్షణా తరగతులకు విజయవాడ, కాకినాడ మరియు విశాఖపట్టణం కార్యాలయాల నుంచి సుమారు 80 మంది క్షేత్ర స్థాయి అధికారులు పాల్గొననున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement