Friday, November 22, 2024

ఇంత ఘోరమా? ఫెయిలైనా పాసైనట్లు ఫలితాలు… పది పరీక్షల్లో విచిత్రాలు

అమరావతి, ఆంధ్రప్రభ: పదో తరగతి పరీక్షల మూల్యాంకనాన్ని 28 రోజుల రికార్డు స్థాయిలో పూర్తి చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం ఫలితాల వెల్లడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పలువురు విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను చెక్‌ చేసుకోగా.. పాస్‌ మార్కుల కన్నా తక్కువ వచ్చినా ఉత్తీర్ణులైనట్లు ఉండటం చూసి అవాక్కయ్యారు. ఈ ఫలితాలపై రీ కౌంటింగ్‌ లేదా రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే మార్కులు తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఒక విద్యార్థి తన హాల్‌ టికెట్‌ నంబర్‌ను చెక్‌ చేసుకోగా ఫలితాలు తప్పుల తడకగా ఉండటాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేశాడు. అలాగే ఇతర జిల్లాల్లోనూ కొంత మందికి ఇలాంటి అనుభవాలే ఎదురైనట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement