ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల అంశంపై ఈరోజు హైకోర్టులో తుది విచారణ జరగనుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టులో 77 పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణకు వచ్చే సమయంలో ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లును వెనక్కు తీసుకుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే పిటీషనర్లు మాత్రం ఈ బిల్లుల్లో మార్పులు చేసి తెస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్లు కోర్టుకు నివేదించారు. విచారణను కొనసాగించాలని పిటీషనర్లు కోరారు. ఏఏ అంశాలపై విచారణ చేయాలో అఫడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు పిటీషనర్లకు సూచించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..