తాడేపల్లి (ప్రభ న్యూస్): ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది. దీనికి సంబంధించిన కసరత్తు అంతా పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. అయితే.. అనుభవం, సామాజిక సమీకరణలతో కొత్త మంత్రి వర్గ కూర్పు చేస్తున్నట్టు సమాచారం. ఇవ్వాల సాయంత్రం, లేదా రేపు ఉదయం గవర్నర్ వద్దకు మంత్రుల రాజీనామా లేఖల ఫైల్ పంపనున్నారు. వెంటనే మంత్రుల రాజీనామాలను ఆమోదం చేసే అవకాశం ఉంది. ఇక కొత్త మంత్రుల జాబితా కూడా ఇవ్వాల సాయంత్రం గవర్నర్ వద్దకు చేరుకోనుంది. GAD ద్వారా సీల్డ్ కవర్‌లో కొత్త మంత్రుల జాబితా పంపనున్నారు. పాత కేబినెట్‌లో 5 నుంచి 9 మందిని కొనసాగించే చాన్సెస్ ఉన్నట్టు సమాచారం అందుతోంది.
ఇక కొత్త మంత్రివర్గంలో ఆశావహులు జాబితా:
1) ధర్మాన ప్రసాదరావు
2) సిదిరి అప్పల రాజు
3) బొత్స సత్యనారాయణ
4) వేణు గోపాల కృష్ణ
5) జోగి రమేష్
6) అనిల్ కుమార్ యాదవ్
7) మధుసూధన్ యాదవ్
8) కొలుసు పార్థసారధి యాదవ్
9) అరని శ్రీనివాసులు
10) గుమ్మనురు జయరామ్
11) విడదల రజనీ
12) ఉషశ్రీ చరణ్
13) కాపు రామచంద్రారెడ్డి
ప్రస్తుతానికి వీరి పేర్లు ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. ఫైనల్ లిస్టులో ఎవరి పేర్లున్నాయనే దానిపై ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి.