అమరావతి, ఆంధ్రప్రభ: వచ్చే ఏడాది పిభ్రవరి నుంచి సెప్టెంబరు వరకు పదవీ విరమణ చేయనున్న విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు (ఏడీ), డివైఈవోల జాబితాను పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు మంగళవారం విడుదల చేశారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 62 సంవత్సరాలు వయో పరిమితి దాటుతున్న అధికారుల రిటైర్మెంట్ తేదీలను ప్రకటిస్తూ అధికారుల జాబితాను విడుదల చేశారు.
ఫిబ్రవరి 28న శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల ఏడీలు డి.నాగరాజు, సి.రంగస్వామి.
మార్చి 31న పార్వతీపురం మన్యం డీఎస్‌ఈవో పి. దామోదరరావు.
ఏప్రిల్ 30న సమగ్ర శిక్ష ఏడీ బి. సత్యనారాయణ.
మే 31న రాయచోటి డివైఈవో ఎ. శివ ప్రకాష్ రెడ్డి, అనంతపురం ఏడీ ఎస్. కృష్ణయ్య.
జూన్ 30న నంద్యాల డీసీ ఎమ్. మెహబూబ్.
సెప్టెంబరు 30న అనకాపల్లి ఏడీ జి. రామజ్యోతి పదవీ విరమణ పొందుతున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయా తేదీలలో వారిని విధుల నుంచి రిలీవ్ అవ్వాలని జాభితాలో పేర్కొన్న అధికారులు డైరెక్టర్ విజయరామరాజు కోరారు.