Friday, November 22, 2024

నల్లమల ఫారెస్ట్​లో తాగునీరు లేక వన్యప్రాణుల విలవిల.. పట్టించుకోని అధికారులు

మహానంది, (ప్రభ న్యూస్‌): వన్యప్రాణాల సంరక్షణ బాధ్యతగా పనిచేయాల్సిన అధికారులు కొందరు నిమ్మక నీరెత్తిన్నట్లు వ్యవహారిస్తున్నారు. దాహాం తీరక నల్లమలలో వన్యప్రాణాలు విలవిలలాడుతున్నాయి. వాటి దాహాం తీర్చేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్న సంరక్షణల లోపాలు ఉండడం వల్ల వన్యప్రాణులు ప్రాణాలు వదులుతున్నాయి. వాటి కోసం ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు ఏమౌతున్నాయో వారికే తెలియాలి. లెక్కల్లో మాత్రం లోపాలు లేకుండా చేస్తున్నారు. కానీ వన్యప్రాణుల రక్షణ మాత్రం కల్పించలేకపోతున్నారు. ఇది నల్లమలలో జరుగుతున్న తంతు. నంద్యాల డివిజన్‌ పరిధిలోని చలమరేంజ్‌లో రెగుమాను కుంట దగ్గర గతంలో ఉన్న అధికారులు వన్యప్రాణుల రక్షణకోసం సోలార్‌ ఏర్పాటు బోరు ఏర్పాటు చేసి వాటి ద్వారా నీటిని వచ్చేలా చేసి వన్యప్రాణులకు దాహాం తీర్చేవారు. నల్లమలలోని నట్ట అడవికావడంతో ప్రతి ఒక్క వన్యప్రాణి అక్కడికి రావాల్సిందే.
.
గత కొద్దిరోజుల నుండి రేగిమానుకుంట దగ్గర సోలార్‌ పనిచేయయడం లేదనే సమాచారం. ఎండలు ముదరడంతో నల్లమలలోని అడవిలో వాగులు, వంకలు ఎండిపోయినట్లు తెలుస్తోంది. వన్యప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఎంతో ఉంది. గతకొన్ని రోజుల నుండి సోలార్‌ పనిచేయకపోవడంతో వినియోగంలో లేనట్టు తెలస్తోంది. అక్కడ వన్యప్రాణాలకు దాహాం తీ ర్చుకునేందుకు సరిపడనీరు లేనట్టుగా సమాచారం. ఇప్పటికైనా ఉన్నతస్థాయి అధికారులు వన్యప్రాణాలపై దృష్టిపెట్టి రేగుమాను కుంట దగ్గర వన్యప్రాణుల కోసం గతంలో చేసిన అధికారుల మాది రిగా ప్రస్తుతం ఉన్న అధికారులు కూడ వన్యప్రాణులకు దాహాం తీరిస్తే వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోకుండా చూసుకోవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement