టీటీడీ ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో దాతల సహకారంతో నిర్మించిన అతిధి గృహాల విషయంలో పేర్ల మార్పునకు నిర్ణయం తీసుకుంది. తిరుమల వ్యాప్తంగా దాతల సహకారంతో గతంలో 45 అతిథి గృహాలను నిర్మించగా, వాటికి ఆయా సంస్థలు, వ్యక్తుల పేర్లు పెట్టారు. అయితే అతిథి గృహాలకు ఆయా సంస్థలు, వ్యక్తుల పేర్లను మార్పు చేయాలని, వాటి స్థానంలో ఆధ్యాత్మిక, ధార్మిక పేర్లు పెట్టాలని టీటీడీ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది.
ఈ క్రమంలో ముందుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతుల విరాళంతో నిర్మించిన లక్ష్మీ వీపీఆర్ అతిథి గృహం పేరును లక్ష్మీ భవన్‌గా మార్పు చేశారు. అతిథి గృహాలకు పేర్ల మార్పు విషయంలో పలువురు దాతలు ఇప్పటికే అంగీకారం తెలిపారు. దీంతో మిగిలిన అతిథి గృహాలకు వ్యక్తిగత పేర్ల స్థానంలో ఆధ్యాత్మిక, ధార్మిక పేర్లను పెట్టనున్నారు.