Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ Indrakeeladri | దేదీప్యమానం అమ్మ కలశజ్యోతి..

Indrakeeladri | దేదీప్యమానం అమ్మ కలశజ్యోతి..

0

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : అమ్మ నామస్మరణ ధ్యానిస్తూ కీర్తిస్తూ పూజిస్తూ చేసే భవాని దీక్షలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న కలశ జ్యోతి ఊరేగింపు దేదీప్యమానంగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతుల ఆదేశాలకు అనుగుణంగా గత 43 సంవత్సరాలుగా నిరంతరాయంగా జరుగుతున్న కలశజ్యోతి ఊరేగింపులో అమ్మ అనుగ్రహం కోసం భక్తజనం ప్రణమిల్లారు.

అత్యంత వైభవంగా అట్టహాసంగా కొనసాగిన కలిసి జ్యోతి ఊరేగింపులో సకల సాంప్రదాయాల మేలవింపుతో జరిగిన ప్రదర్శన ధర్మ ప్రచారం ఆధ్యాత్మిక వ్యాప్తి కోసం అనేది ప్రతిబింబించింది. ఆధ్యాత్మిక వైభవాన్ని చాటిచెప్పిన కలిసి జ్యోతి ఊరేగింపుతో నగరవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది.

దేదీప్యమానంగా కలశ జ్యోతి ఊరేగింపు..

ఇంద్రకీలాద్రి పై కొలువున్న దుర్గా అమ్మవారిని నియమబద్ధ దీక్షతో పూజించి, అమ్మ అనుగ్రహం పొందటానికి కంచి కామకోటి పీఠాధిపతుల ఆదేశానుసారం 1981 నుండి భవానీ దీక్షలు, కలశ జ్యోతి ఊరేగింపు ప్రారంభం అయింది. ఆనవాయితి ప్రకారం సత్యనారాయణపురం రామకోటి ప్రాంగణం నుండి సాయంత్రం 6 గంటలకు దేవస్థానం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆది దంపతులు ప్రత్యేకంగా అలంకరించిన రధం పై అధిరోహించగా, ఆలయ కార్యనిర్వహణాధికారి కె. ఎస్. రామరావు, స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

కోలాటాలు, నృత్యాలు వంటి సంప్రదాయ కళాకారుల ప్రదర్శనల మధ్య వివిధ ప్రాంతాల నుండి కుటుంబ సామెతంగా విచ్చేసిన భవానీ భక్తులు కలశ జ్యోతులను చేత పట్టుకొని జై జై దుర్గా నామ స్మరణతో ముందుకు సాగారు. రామకోటి నుండి గాంధీనగర్, గవర్నర్ పేట, కంట్రోల్ రూమ్ పై వంతెన మీదుగా సుమారు 7 కిలోమీటర్లు ప్రయాణం గల ఈ కలశ జ్యోతి ఊరేగింపులో కళా ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Exit mobile version