కావలి, (ప్రభ న్యూస్) : బీటెక్ విద్యార్థి రాజేంద్ర హత్య కేసులో పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని, అతి త్వరలో నిందితులను పట్టుకుంటామని జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌ను నిన్న ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 26 నాడు వెలుగు చూసిన బీటెక్ విద్యార్థి రాజేంద్ర హత్య కేసుపై రాజేంద్ర కుటుంబ సభ్యులు, పోలీసు వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని ఎస్పీ స్వయంగా సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి కంచర్ల రాజేంద్ర( 21) హత్య కేసులో డీఎస్పీ దేవరకొండ ప్రసాద్, రూరల్ సీఐ ఖాజావలి, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, కలిగిరి సీఐలు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారన్నా రు. రాజేంద్ర హత్యకు గురైన చోట కొన్ని ఆధారాలు లభించాయన్నారు. అలాగే పోస్టుమార్టం రిపోర్ట్‌లో మరికొన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. వాటి ఆధారంగా అన్ని కోణాలలో విచారించి అతి త్వరలో నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరుస్తామన్నారు. అధికారులతో మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవాలని, ముఖ్యమైన, తీవ్రమైన కేసుల్లో గుర్తుంచుకోవాల్సిన విషయాలపై పలు సూచనలు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital