Thursday, November 21, 2024

Big Story : తగ్గుతున్న మావోయిస్టుల‌ ప్రాబల్యం.. లొంగుబాటుతో కోలుకోలేని దెబ్బ

అమరావతి, ఆంధ్రప్రభ : కటాఫ్‌ ఏరియాలో మావోయిస్టు పార్టీ ప్రాబల్యం క్రమేణా తగ్గుతోంది. దశలవారీగా వందల సంఖ్యలో మావోలు, మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు లొంగబాట పడుతున్న క్రమంలో అన్నలకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చాయని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్న క్రమంలో ఆయా చోట్ల పోలీసుశాఖ చేప డుతున్న పునరావాస కార్యక్రమాలు, ప్రభుత్వ పధకాలు అమలు వంటి సంక్షేమ చర్యలు సానుభూతిపరులు, గిరిజన ప్రజలపై పోలీసు మార్కు ప్రభావం చూపుతున్నాయి. దీనిలో భాగంగా ప్రస్తుతం ఏజెన్సీలో అమలవుతున్న సేతు కార్యక్ర మం సత్ఫలితాలిస్తోంది .

కోవిడ్‌ కాలం ఒకరకంగా మావోల ఉనికికి గొడ్డలి పెట్టయిందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కరొనా ప్రభావంలో రెండు మార్లు లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఏఓబీలో కూంబింగ్‌ కొనసాగినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కోవిడ్‌కు భయపడి కార్యకలాపాలకు బ్రేక్‌ వేయడంతో పాటు అన్నల కదలికలు కూడా పూర్తిగా మందగించాయి. కరోనా బాలిన పడకుండా బయటకు రాలేని పరిస్ధితి ఒకవైపు, దళంలో ఆరోగ్య సమస్యలతో బాధపడేవారి వైద్య పరిరక్షణ మరోవైపు పార్టీకి తీవ్ర ఆటంకాలుగా మారాయి. అప్పటికీ చాలామంది దళ సభ్యులు కరోనా బారిన పడి ప్రాణాల విడిచినట్లుగా నిఘా వర్గాలు అప్పట్లో స్పష్టం చేశాయి కూడా.

ఈ నేపధ్యంలో కోరానో కల్లోలం నుంచి ప్రపంచం నెమ్మదిగా బయటపడి సామాన్య జీవన స్ధితికి చేరుకుంటున్న తరుణంలో మావోయిస్టులు కూడా క్రమేణా చురుకందుకుని ఉనికి చాటుకునే ప్రయత్నాలు షురూ చేశారు. దీనిలో భాగ మే కొది ్ద నెలలుగా బస్సు దగ్ధం, పలువురిని కాల్చి చంపడం, ఇతర హింసాత్మక ఘటనలే ఉదాహరణలని పోలీసు అధికారులు చెబుతున్నారు. వీటి ద్వారా ఉనికి చాటి చెబుతూ తమ బలం తగ్గలేదని నిరూపించుకునే యత్నంమేనని, అయితే వ్యూహం మార్చిన పోలీసుశాఖ ఒరిస్సా-ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలు, ఆంధ్రాలోని మావోప్రభావిత జిల్లాలైన అల్లూరి, అనకాపల్లి, విశాఖ ఏజెన్సీలో చైతన్య కార్యక్రమాలు ముమ్మరం చేశారు.

ప్రధానంగా మావో సానుభూతిపరులు, గిరిజన ప్రజలపై ఫోకస్‌ పెట్టి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వైపు వారిని మళ్ళిస్తున్నారు. ఇదే సమయంలో బలగాలు కూంబింగ్‌ జరుపుతూ దూసుకెళ్తున్నాయి. గిరిజన ప్రజలకు, సానుభూతిపరులకు అన్నలను దూరం చేయడంతోపాటు ఏరివేత కార్యక్రమం చేపడుతూనే దళ సభ్యులు, సానుభూతిపరులు, ఇన్‌ఫార్మర్లను జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రేరేపిస్తూ లొంగుబాటుకు మార్గం సుగమం చేస్తున్నారు.

400 మంది లొంగుబాటు..

- Advertisement -

ఈ క్రమంలోనే ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో 400 మంది మావోయిస్టు సానుభూతిపరులు తాజాగా లొంగిపోవడం జరిగింది. వీరిలో చాలా మంది మిలీషియా సభ్యులు కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. లొంగిపోయిన అనంతరం మావోయిస్టులు వీరికి ఇచ్చిన డ్రెస్సులు దహనం చేసి మావోలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం గమనార్హం. మన రాష్ట్రంలోని అల్లూరి జిల్లా, ఒడిశాకుచెందిన మావోయిస్టు సానుభూతిపరులు బిఎస్‌ఎఫ్‌ దళాల ముందు సరెండర్‌ కావడం మంచి పరిణామంగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

ఏఓబీ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జనజీవన స్రవంతిలోకి వచ్చామని లొంగిపోయిన మావోయిస్టు సానుభూతిపరులు చెప్పడం విశేషం. ఇంత భారీ సంఖ్యలో లొంగుబాటులను ప్రోత్సహిస్తున్న పోలీసుశాఖ తాము అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు పని చేస్తున్నాయని అంటున్నారు. ఇదే తరహాలో గత నెలలోనే ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని బోండా ఘాట్‌లో దాదాపు 700 మంది మావోయిస్టు సానుభూతి పరులు లొంగిపోయారు. 65వ బీఎస్‌ఎఫ్‌ బెటాలియన్‌ శిబిరం వద్ద సానుభూతిపరుల లొంగుబాటు- కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు- చేసి పార్టీని వీడేందుకు బలగాలు ప్రోత్సాహాని ్నచ్చాయనడంలో మరో మాటే లేదని చెప్పాలి.

ఇక తాజా లొంగుబాటు విషయానికొస్తే ఏవోబీలోని మల్కన్‌గిరి జిల్లా పప్పర్లమెట్ల, దూలిపుట్‌ గ్రామ పంచాయతీలకు చెందిన మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఇంజరి, జాముగూడ, బొయితిలి గ్రామ పంచాయతీలకు చెందిన మావోయిస్టు సానుభూతిపరులు కూడా లొంగిపోయారు.

ఇన్‌ఫార్మర్లపై హింసా కారణమే..

మావో పార్టీకి ఇన్‌ఫార్మర్ల వ్యవస్ధ అత్యంత కీలకమైనది. అయితే గత కొద్దికాలంలో వారిలో వచ్చిన మార్పు, కార్యకలాపాలకు స్వస్తి పలకడంతో వారే పోలీసు వ్యవస్ధకు ఇన్‌ఫార్మర్లగా మారారనే అనుమానంతో వారిపై మావోలు సాగిస్తున్న హింసాధోరణి కూడా పార్టీ ప్రాబల్యానికి గొడ్డలి పెట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో కూడా ఇలా చాలామందిని కాల్చి చంపిన ఘటలను ప్రస్తావిస్తున్నారు.

తాజాగా 400 మంది లొంగుబాటకు ముందురోజే దంతెవాడ జిల్లా రేవాలి గ్రామంలో ఓ మహిళా సర్పంచి భర్తను హత్య చేశారు. మలంగీర్‌ ఏరియా కమిటీ-కి చెందిన సాయుధులైన కొంతమంది మహిళా సర్పంచి ఇంటికి వచ్చి భర్త భీముడును బయటకు తీసుకెళ్లారు. పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నావంటూ హతమార్చినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మిగిలిన వారిలో పార్టీ పట్ల తిరుగుబాటు భావం ఏర్పడుతోందంటున్నారు.

అల్లూరిలో ‘సేతు’ సత్ఫలితాలు..

అల్లూరి, అనకాపల్లి, విశాఖ ఏజెన్సీలోని మావో ప్రభావం ఉన్న ప్రాంతాల్లో తాజాగా పోలీసుశాఖ సేతు అనే కార్యక్రమం చేపట్టింది. గిరిజన ప్రజలు, జనజీవన స్రవంతిలో కలిసిన సానుభూతిపరులు, ఇన్‌ఫార్మర్ల కుటుంబాలు, అక్కడి గ్రామాల్లోని అంగవైకల్యం, దివ్యాంగులను ఆదుకునేందుకు సేతు పధకం కింద చేపట్టిన సదరం కార్యక్రమం సత్ఫలితాలిచ్చిందని డీజీపీ కెవి రాజేంద్రనాధ్‌ రెడ్డి తెలిపారు. వీటితోపాటు గంజాయి, నాటుసారా వైపు మళ్ళకుండా కల్పిస్తున ప్రత్యామ్నాయాలను ఇటీవల సురజ్‌ఖండ్‌లో జరిగిన జాతీయ హోంమంత్రుల సదస్సులో ప్రస్తావించినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement