Friday, November 22, 2024

AP: మైనార్టీల‌ను గుండెల్లో పెట్టుకున్న ప్ర‌భుత్వం త‌మ‌దే.. జ‌గ‌న్

విజయవాడ: మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న ప్రభుత్వం త‌మ‌దేన‌ని ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం సంద‌ర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ… ఇది మ‌నంద‌రి ప్ర‌భుత్వ‌మ‌ని ఉద్ఘాటించారు. మైనార్టీలకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. గతానికి, ఇప్పటికి మధ్య తేడాలు గమనించాలన్నారు. గత ప్రభుత్వంలో మైనార్టీలను టీడీపీ గాలికొదిలేసింది. డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ఈ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. ముస్లింలలో పేదలందరికి వైయ‌స్ఆర్‌ రిజర్వేషన్‌లు అమలు చేశారని సీఎం గుర్తు చేశారు.

వైయ‌స్ఆర్‌ రిజర్వేషన్‌లు అమలు చేశారని సీఎం గుర్తు చేశారు. ఆయ‌న కుమారుడిగా నాలుగు అడుగులు ముందు వేస్తూ త‌మ‌ పార్టీ నుంచి న‌లుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నామ‌న్నారు. మైనార్టీలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని సీఎం జగన్‌ చెప్పారు. మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేశామన్నారు. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ముస్లిం మహిళకు అవకాశం కల్పించామ‌న్నారు. సాధికారిత అనేది మాటల్లో కాదు.. చేతల్లో చూపించామ‌న్నారు. అన్ని రంగాల్లో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మైనార్టీల అభ్యున్నతి కోసం 2019 నుంచి అనేక మార్పులు తీసుకొచ్చామ‌న్నారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చేందుకు గత సర్కారు ఏనాడు చొరవ చూపలేదన్నారు. లంచాలు, వివక్షకు తావులేకుండా పాలన కొనసాగిస్తున్నామ‌న్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనేదే మన బలమ‌న్నారు. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోంద‌ని సీఎం పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.బి.అంజాద్‌ బాషా మాట్లాడుతూ…. భారతదేశ విద్యాప్రధాత మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్, ఎంతోమంది మహానుభావులను ఆదర్శంగా తీసుకుని కులమతవర్గాలకు అతీతంగా ప్రజారంజక పాలన అందిస్తున్న సీఎం కేబినెట్‌లో మొట్టమొదటి ముస్లిం మైనార్టీ ఉప ముఖ్యమంత్రిగా, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. 2005లో జస్టిస్‌ సచార్‌ కమిటీ నివేదిక ప్రకారం ముస్లింలు చాలా వెనకబడి ఉన్నారని నివేదించారు.. కానీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. కానీ నాడు వైఎస్‌ఆర్‌ ముస్లింలకు రిజర్వేషన్లు తీసుకొచ్చారు, దాంతో ఎంతోమంది అవకాశాలు పొందారన్నారు. ఆ తర్వాత ఆయన తనయుడు సీఎం జ‌గ‌న్ ముస్లిం మైనార్టీలకు రాజకీయ సాధికారత కల్పించారన్నారు. గతంలో చంద్రబాబు ఒక్క ముస్లిం ఎమ్మెల్యేనైనా గెలిపించుకున్నాడా, ముస్లింలపై కపట ప్రేమ చూపాడున్నారు. కానీ సీఎం జ‌గ‌న్ దేశంలో ఎక్కడా లేని విధంగా తన క్యాబినెట్‌లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులుగా చేశారన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement