Friday, November 22, 2024

AP | తొలిరోజే ప్రభుత్వ పాఠశాలకు తాళం..

ఎమ్మిగనూరు, (ప్రభన్యూస్) : ఎమ్మిగనూరు మండలం గార్లదిన్నె గ్రామంలో రెగ్యులర్ టీచర్లు నియమించాలని అక్కడ తాత్కాలికంగా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా గురుస్వామిని పాఠశాల నుండి బయటకు పంపించాల‌ని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళాలు వేశారు.

ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ… గతేడాది నుంచి ఎంపీపీఎస్ పాఠశాలలో రెగ్యులర్ ఉపాధ్యాయులు లేక 90 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో ఉన్నటువంటి రెగ్యులర్ టీచర్లు ప్రమోషన్ మీద ఇక్కడ నుండి బదిలీ అయ్యారని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రెగ్యులర్ ఉపాధ్యాయుడిని కూడా నియమించలేదని, ఇక్కడ ఒక్కరే తాత్కాలిక టీచర్ ఉన్నారని తెలిపారు.

ఐదవ తరగతి అయిపోయినటువంటి విద్యార్థులకు ముందు తరగతులకు వెళ్లడానికి టిసి కావాలి ఆ టీసీలపైన రెగ్యులర్ టీచర్స్ సంతకం ఉండాలి కానీ మా పాఠశాలలో రెగ్యులర్ టీచర్ లేనందుకు సంతకాలు చేయడానికి ఏ టీచర్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు అని తెలిపారు.

ఐదో తరగతి చదివిన విద్యార్థులు పై తరగతులకు వెళ్లాలంటే టీసీ అవసరమని, ఆ టీసీలపై రెగ్యులర్ ఉపాధ్యాయుల సంతకం ఉండాలని, మా పాఠశాలలో రెగ్యులర్ టీచర్ లేకపోవడంతో విద్యార్థుల టీసీపై సంతకం చేయడానికి ఏ టీచర్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు అని తెలిపారు. అదేవిధంగా గతంలో ఈ విషయంపై గ్రామస్తులందరం క‌లిసి జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని విద్యార్థుల తల్లిదండ్రులు విలపించారు.

ఈ విషయాన్ని విద్యాశాఖాధికారులు దృష్టిలో ఉంచుకుని గార్లదిన్నె గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలకు రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. లేనిపక్షంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ నిర‌స‌న‌లో గ్రామస్తులు సుధాకర్, దావీదు, రాజన్న, ప్రతాప్ , దేవిపుత్ర హుస్సేని, దినేష్ , గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement