ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. అయితే ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ నిర్దేశించిన మొత్తం కంటే వరద బాధితులకు ఆర్థిక సాయాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 179 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఇళ్లు పూర్తిగా నీట మునిగిన బాధితులకు ప్రకటించిన సాయాన్ని పెంచారు. ఈ మేరకు సోమవారం నాడు (సెప్టెంబర్ 23న) ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఆర్ఎఫ్ రూ.11 వేలు నిర్దేశించగా.. ఏపీ ప్రభుత్వం ఆ సాయం మొత్తాన్ని రూ.25 వేలకు పెంచింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement