Tuesday, November 26, 2024

అమ‌రావ‌తి భూములు అమ్మే హ‌క్కు ప్ర‌భుత్వానికి లేదు : చంద్ర‌బాబు

అమరావతి భూములు, భవనాలు అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని, రాజధాని కట్టని వారికి భూములు అమ్మే హక్కు, ఉద్యోగులకు కట్టిన ఇళ్లను ప్రైవేట్‌ సంస్థలకు అద్దెకు ఎలా ఇస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్ర‌శ్నించారు. పార్టీ ముఖ్యనేతలతో చంద్ర‌బాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అమరావతిని శ్మశానమ‌ని చెప్పిన ప్రభుత్వం ఈ భూములను ఎకరాకు రూ.10 కోట్లు ఎలా అమ్ముతుందని నిలదీశారు. అధికార వైసీపీ పాలనలో ప్రజలకు పన్నుల వాతలు, పథకాలకు కోతలు విధిస్తున్నారని ఆరోపించారు.

ఒంటరి మహిళల పింఛనులో ఆంక్షలు విధించడం అమానవీయమని అన్నారు. నిధుల్లేక దుల్హన్‌ పథకం నిలిపివేశామని కోర్టుకు చెప్పడం దారుణమని చంద్రబాబు అన్నారు. పంట నష్టపోయిన రైతులకు మొండి చేయి చూపించారని ఆరోపించారు. అమ్మ ఒడిలో 52 వేల మంది లబ్ధిదారులు తగ్గారని అన్నారు. ఆత్మకూరులో డబ్బు పంచినా వైసీపీకి ఓటు శాతం పెరగలేదని చంద్ర‌బాబు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement