Saturday, November 23, 2024

ఉద్యోగుల జీపీఎఫ్‌ సొమ్ము డ్రా చేసే అధికారం ప్రభుత్వానికి లేదు.. టీడీపీ ఎమ్సెల్సీ అశోక్ బాబు

అమరావతి, ఆంధ్రప్రభ : ఏ రాష్ట్రంలో జరగని ఎకానమిక్‌ ఫైనాన్షియల్‌ డిజాస్టర్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు ఆరోపించారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ అవసరాలు, పిల్లల భవిష్యత్‌ కోసం దాచుకున్న జీపీఎఫ్‌ సొమ్మును ప్రభుత్వం మాయం చేసిందని మండిపడ్డారు. జనరల్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ను జగన్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌గా మార్చారని విమర్శించారు. 2020 – 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల జీపీఎఫ్‌ అకౌంట్‌లో డీఏ ఏరియల్స్‌ జమచేసి వాటిని మళ్లిd వెనక్కి తీసుకున్నారని తెలిపారు.

అయితే ఈ ఏరియల్స్‌ మొత్తం ఇచ్చినట్లుగా డెబిట్‌లో చూపిస్తున్నారని చెప్పారు. జీపీఎఫ్‌ ఖాతాలో జమ అయిన డబ్బును డ్రా చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని, ఒక్క ఉద్యోగులకే ఉంటుందని తెలిపారు. మొత్తం రూ. 1800 కోట్లను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లుగా ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయని వేసిన డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అశోక్‌బాబు ప్రశ్నించారు.

రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 2 వేల 200 కోట్లు చెల్లించాల్సి ఉందని ఇంత వరకు ఆ నగదును వారి అకౌంట్స్‌లో జమచేయలేదని తెలిపారు. ఉద్యోగుల లెక్కలకు జీపీఎఫ్‌ స్లిప్పులకు పొంతన లేకుండా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జమచేసిన సొమ్మును వెనక్కి తీసుకోవడం అత్యంత దుర్మార్గమైందని రూ. 800 కోట్లు డీఏ ఏరియల్స్‌ వెనక్కి తీసుకోవడంపై ప్రభుత్వ ఉద్యోగులకు సమాధానం చెప్పాలని అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement