ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి రాయితీ నిధులు విడుదల చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ వేశారు. పంటలు నష్టపోయిన రైతుల ఖాతాల్లోకి రూ.542.06కోట్లు జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5,97,311మంది రైతులకు లబ్ది చేకూరనుంది. యంత్ర సేవా పథకం కింద మరో రూ.29.51కోట్ల సబ్సిడీ ఇచ్చారు. ఈ పథకంతో 1220 గ్రూపులకు లబ్ది చేకూరనుంది. రైతుల ఖాతాల్లోకి మొత్తంగా రూ.571.57కోట్లు జమ చేశారు. బటన్ నొక్కగానే రైతుల ఖాతాల్లోకి ఇన్ ఫుట్ సబ్సిడీ జమ అయ్యిందన్నారు. రాయలసీమలో గ్రౌండ్ వాటర్ లెవల్ పెరిగిందన్నారు. చెరువులు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital