తిరుమల, ప్రభన్యూస్ : తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్ప పై సీత లక్ష్మణ ఆంజనేల సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శన మిచ్చారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు సీతా లక్ష్మణ ఆంజనేల సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగుమాడవీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది.
తొలిరోజు సీతాలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్ప పై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి ఆలయ డిప్యూటిఈవో రమేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..