Saturday, November 23, 2024

సిరిమానోత్స‌వానికి మొద‌టి అంకం -సిరిమాను చెట్టుకు పూజ‌లు

పూజారికి పైడిత‌ల్లి అమ్మవారు క‌ల‌లో క‌నిపించి చెప్ప‌డంతో చెట్టుకు బొట్టు పెట్టి పూజ‌లు నిర్వ‌హించారు.దాంతో విజయనగరం పైడితల్లి అమ్మ వారి సిరిమానోత్సవానికి మొదటి అంకం మొదలయింది. ఈ క్రమంలోనే సిరిమాను చెట్టుకు పూజలు చేయడానికి భక్తులు పోటెత్తుతున్నారు. పైడితల్లి అమ్మ వారి సిరిమాను చెట్టును సిరిపురం గ్రామంలో గుర్తించారన్న సమాచారంతో భక్తులు భారీగా తరలివచ్చి ఆ చెట్టుకు పూజలు చేస్తున్నారు. తమ గ్రామంలోని చెట్లను అమ్మ వారు సూచించడంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. జంటగా పుట్టిన 15 అడుగుల చింతచెట్లను పైడితల్లి అమ్మ వారు పూజారికి కలలో సూచిస్తారు. దీంతో ఆ చెట్లకు పూజలు చేసి సిరిమానుకు ఉపయోగిస్తారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ప్రతి ఏటా దసరా తరువాత పైడితల్లి అమ్మ వారి సిరిమానోత్సవం జరుగుతుంది. దీంతో నెలరోజుల ముందు నుంచే విజయనగరంలో పండుగ వాతావరణం నెలకొంది. విజయనగరం రాజవంశానికి చెందిన పైడితల్లి అమ్మ వారు తమ గ్రామంలో చెట్లను కోరుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అమ్మ వారి కరుణాకటాక్షాలు తమపై ఉండాలని వేడుకుంటున్నామని భక్తులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement