Friday, November 22, 2024

ఆమ్దానీ కంటే ఖ‌ర్చెక్కువ‌, లెక్క‌లు చెప్పాల‌న్న కాగ్‌.. ఏపీ త‌డ‌బాటు, తెలంగాణ ముఖం చాటు..

అమరావతి, ఆంధ్రప్రభ : వార్షికాంత లెక్కలపై ఆర్ధిక శాఖాధికారులు తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. మార్చి నెల లెక్కలను సమర్పించడంలో ఏపీ తడబాటు ధోరణి వ్యక్తం చేస్తోండగా, చేసిన రుణాలు, ఇచ్చిన గ్యారెంటీలు అందించడంలో తెలంగాణ ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల తీరుపై ఇప్పటికే అనేక లేఖలు రాసిన కాగ్‌, తాజాగా మరో లేఖ కూడా రాసినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఆర్థికశాఖ అధికారులు మాత్రం అందించాల్సిన లెక్కల వివరాలను ఖరారు చేయనట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతినెలా ఆర్థికశాఖ అధికారులు తమ రాష్ట్రాల ఆర్థిక లావాదేవీలను అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రానికి సంభందించి ఫిబ్రవరి నెల వరకు నెలవారీ వివరాలు ఇచ్చినప్పటికీ, మార్చి లెక్కలు మాత్రం ఇప్పటివరకు ఇవ్వకపోవడం వెనుక గణాంకాలను సిద్ధం చేయకపోవడమేనని అధికారులు అంటున్నారు. ఎజి కార్యాలయం, రిజర్వ్‌బ్యాంకు, కాగ్‌ అడిగిన ప్రశ్నలకు జవాబులు లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతోందని వారంటున్నారు. ప్రతినెలా ఎజి కార్యాలయం సొంత లెక్కలు సిద్ధం చేసి, వాటిని ఆర్థికశాఖకు పంపిస్తుంది. ఆ లెక్కలకు, ఆర్థికశాఖ వద్ద ఉన్న లెక్కలకు భారీగా తేడా ఉన్నట్లు తెలుస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం తేల్చిన లెక్కల్లో రాష్ట్రానికి వచ్చిన సొంత ఆదాయం కన్నా చేసిన వ్యయం భారీగా ఉన్నట్లు గుర్తించారు. ఈ లోటు ఏకంగా రూ.1,15,949 కోట్లకు చేరుకోవడం విశేషం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.1,04,383 కోట్లు లోటుగా తేలితే… ఈ ఏడాది రూ.లక్షా 15 వేల కోట్ల వరకు లోటు ఉన్నట్లు తేలింది.

ఇదే సమయంలో బహిరంగ మార్కెట్‌ రుణాలు, సంస్థలకు ఇచ్చిన గ్యారెంటీల ద్వారా తీసుకున్న రుణాలు కలిపి భారీగా తేలినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే గ్యారెంటీల ద్వారా తెచ్చుకున్న రుణాలపై ఆర్థికశాఖ లెక్కలు చెప్పడం లేదని కేంద్రం, రిజర్వ్‌బ్యాంకు కూడా ఆరోపణలు చేయడం తెలిసిందే. అందుకే మార్చి లెక్కలపై ఇంకా ఆర్థికశాఖ తాత్సార ధోరణి అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై తాజాగా ఎజి కార్యాలయం నుంచి మరోసారి ఆర్థికశాఖకు లేఖ వచ్చినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం కూడా కొన్ని లెక్కలను ఇప్పటికీ సమర్పించలేదని తెలిసింది. ప్రధానంగా ఎపిలో ఉన్నట్లుగానే తెలంగాణలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలకు గ్యారెంటీలు ఇచ్చి భారీగా రుణ సమీకరణ చేసినట్లు అక్కడి అధికారుల ద్వారా తెలిసింది. అందుకే ఆ వివరాలను కాగ్‌కు అందించడంలో తెలంగాణ ఆర్థికశాఖ విముఖత చూపించినట్లు సమాచారం. కాగ్‌ వార్షిక గణాంకాల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. తమకు ఆ వివరాలు రాలేదని కాగ్‌ రాతపూర్వకంగానే పేర్కొంది.

ఆదాయం పెంచుకోవడం ద్వారా ద్రవ్య లోటు తగ్గింపుకు కసరత్తు..

వివిధ మార్గాల ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచుకోవడం ద్వారా ద్రవ్య లోటు తగ్గింపుకు ఆర్ధిక శాఖ కసరత్తు చేస్తోంది. ఆదాయ వ్యయాల మధ్య పెరిగిపోతున్న అరతరం కారణంగా ఆదాయ, ద్రవ్య లోటు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతోంది. దీనిని కొరతవరకైనా తగ్గిరచేరదుకు తాజాగా ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభినట్లు సమాచారం. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఆదాయ లోటును 2.4 శాతానికి, ద్రవ్య లోటును 3.5 శాతానికి తగ్గిరచాలని యోచిస్తోంది. దీనిపై కొద్ది రోజులుగా ఆర్థికశాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. నీతి ఆయోగ్‌ కూడా ఆదాయ, ద్రవ్య లోటుపై నిర్ధిష్ట మార్గదర్శకాలు, పరిమితిని సూచిరచిన నేపథ్యంలోనే ఈ చర్యలకు ఉపక్రమిరచినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆదాయ, ద్రవ్య లోటు పరిమితికి మించి కొనసాగుతున్నాయి. స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా గణించే లోటు ప్రతి యేటా ప్రభుత్వానికి గుదిబండగానే మారుతోంది. జిఎస్‌డిపి ప్రస్తుతం రూ.12 లక్షల కోట్లుగా రాష్ట్ర ప్రణాళిక శాఖ అంచనా వేసింది.

ప్రస్తుతం ద్రవ్య లోటు ఫిబ్రవరి నాటికే రూ.52 వేల కోట్ల వరకు చేరిపోయింది. అంటే జిఎస్‌డిపిలో నాలుగున్నర శాతం వరకు ఉన్నట్లు తేలింది. అదే ప్రసుత ధరల మేరకు ఈ లోటు 5.30 శాతంగా ఉన్నట్లు ప్రణాళికశాఖ గుర్తించింది. నీతి ఆయోగ్‌ మార్గదర్శకాల మేరకు కేవలం 3 శాతంగానే ఉండాలని, ఆ శాతం దాటకూడదని నిబంధనలు ఉన్నాయి. అందుకే 2025-26 నాటికి కనీసం 3.5 శాతానికైనా తగ్గించాలని ఆలోచన చేస్తున్నారు. ఆదాయ లోటు కూడా ఫిబ్రవరి వరకు 3.16 శాతానికిపైగానే రికార్డయింది. ఆదాయం తగ్గిపోయి, వ్యయం పెరిగిపోవడంతో ఆదాయ లోటు గణనీయంగా పెరిగిపోతూ వస్తోంది. దీనిపై దృష్టి సారించాలని ఆలోచిస్తున్నారు. ఖర్చులు తగ్గించుకోవడం ఇప్పట్లో సాధ్యం కాని పనిగా భావిస్తున్నందున, ఆదాయం పెరచుకోవడం ద్వారానే ఆదాయ లోటు తగ్గిరచుకోవాలని యోచిస్తున్నట్లు ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement