Wednesday, January 8, 2025

EC | ఏపీ, తెలంగాణ ఓటర్ల తుది జాబితా విడుదల !

తెలంగాణ ఎన్నికల సంఘం సవరించిన ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు సీఈవో సుదర్శన్ రెడ్డి తుది ఓటరు జాబితాను ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం తెలంగాణలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉండ‌గా… ఇందులో పురుషులు 1,66,41,489, మహిళలు 1,68,67,735, థర్డ్ జెండర్ 2,829 మంది ఉన్నారు.

వీరిలో 18-19 ఏళ్లలోపు ఓటర్లు 5,45,026 మంది, 85 ఏళ్లు పైబడిన సీనియర్ ఓటర్లు 2,22,091 మంది, ఎన్నారై ఓటర్లు 3,591 మంది ఉన్నారు. 5,26,993 మంది వికలాంగ ఓటర్లు ఉన్నారు. కాగా, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా భద్రాచలంలో 1,54,134 మంది ఓటర్లు ఉన్నారు.

- Advertisement -

ఏపీ ఓటర్ల జాబితా..

ఏపీ ఎన్నికల సంఘం సవరించిన తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం జనవరి 1, 2025 నాటికి రాష్ట్రంలో మొత్తం 4,14,40,447 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 2,10,81,814 మంది పురుషులు, 2,02,88,549 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

అలాగే సర్వీస్ ఓటర్లు 66,690 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 3400 మంది ఉన్నట్లు ఏపీ ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మొత్తం ఓటర్లలో 18-19 సంవత్సరాల మధ్య వయస్సు గల ఓటర్లు 5,14,646 మంది ఉన్నారు. రాష్ట్రంలో 46,397 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని… గతేడాదితో పోలిస్తే 232 పోలింగ్‌ కేంద్రాలు పెరిగాయని ఎన్నికల సంఘం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement