Saturday, January 18, 2025

రెండవ ఎడిషన్‌తో మహోన్నతంగా తిరిగి వస్తోన్న ఎక్స్‌పో

హైద‌రాబాద్, (ఆంధ్ర‌ప్ర‌భ ) : అంతర్జాతీయ దేవాలయాల సదస్సు, ఎక్స్‌పో (ఐటీసీఎక్స్) దాని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండవ ఎడిషన్‌తో మహోన్నతంగా తిరిగి వస్తోంది. 2023లో దాని ప్రారంభ అధ్యాయం అద్భుతమైన విజయం, విస్తృత ప్రశంసలను సంపాదించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మద్దతు కూడా లభించింది.

ఈ సంవత్సరం ఈ సమావేశం స్థాయి, పరిధిలో మరింత అద్భుతంగా ఉంటుందని హామీ ఇచ్చింది. ఫిబ్రవరి 17 నుండి 19 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని పరమ పవిత్రమైన ఆలయ నగరమైన తిరుపతిలో ఇది జరగనుంది. టెంపుల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు గిరేష్ కులకర్ణి నేతృత్వంలో జరుగుతున్న ఈ మైలురాయి కార్యక్రమానికి ప్రసాద్ లాడ్ (ఐటీసీఎక్స్ 2025 చైర్మన్ అండ్ మహారాష్ట్ర శాసన మండలి సభ్యుడు) సహ-నాయకత్వం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా టెంపుల్ కనెక్ట్ అండ్ ఐటీసీఎక్స్ వ్యవస్థాపకుడు గిరేష్ కులకర్ణి మాట్లాడుతూ… తదుపరి అంతర్జాతీయ దేవాలయాల సమావేశం అండ్ ఎక్స్‌పో (ఐటీసీఎక్స్) 2025 ను పవిత్ర నగరం తిరుపతిలో జరుగుతుందని ప్రకటించడానికి తాను సంతోషిస్తున్నానన్నారు. ఆలయ నిర్వహణలో పరివర్తనను నడిపించడం, భక్తుల పవిత్ర అనుభవాలను పెంచడం మన సామూహిక భక్తిని చూడటం నిజంగా సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -

ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో 2025 చైర్మన్ (మహారాష్ట్ర ప్రభుత్వంలోని లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ హక్కుల ఉల్లంఘన కమిటీ చైర్మన్) ప్రసాద్ లాడ్ మాట్లాడుతూ… ఐటీసీఎక్స్ మన గొప్ప, విశిష్టమైన ఆలయ వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఆలయ పర్యావరణ వ్యవస్థలో ఆవిష్కరణ, పరివర్తనకు మార్గం సుగమం చేస్తూ లోతైన జాతీయ గర్వాన్ని నింపుతుందన్నారు. ఆలయ నిర్వహణతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల వివిధ సంస్కృతులు, కళలు, చేతిపనులు, సంప్రదాయాలను కనుగొనడానికి ఈ సమావేశం ఒక ప్రత్యేకమైన వేదికను కూడా అందిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement