Monday, September 16, 2024

విద్యార్థుల తరలింపు వేగవంతం చేయాలి.. కేంద్రానికి కనకమేడల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉక్రెయిన్‌లో చిక్కున్న తెలుగు విద్యార్థులందరినీ వీలైనంత త్వరగా స్వస్థలాలకు చేర్చాలని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు సోమవారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఉన్న తెలుగు విద్యార్థులను కలిసి వారి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థులకు ఢిల్లీలో దగ్గరుండి సహాయ సహకారాలు అందించాలని చంద్రబాబు ఆదేశించించారని ఆయన మీడియాకు వెల్లడించారు. విద్యార్థుల వెతలు, చేదు అనుభవాలను విదేశీ వ్యవహరాల శాఖా మంత్రి దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నామని కనకమేడల చెప్పారు.

విద్యార్థుల సహాయార్థం దేశ రాజధానిలోని టీడీపీ కార్యాలయం 24 గంటలూ పని చేస్తుందని తెలిపారు. విద్యార్ధులు, తల్లితండ్రులు ఏ అవసరమున్నా టీడీపీపీ కార్యదర్శి నౌపడా సత్యనారాయణ 9868219008, 9868633008 ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని కోరారు. భోజనం, నిలువ నీడ లేక ఉక్రెయిన్‌లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, సరిహద్దుల్లో సాయుధ దళాలు అమానుషంగా వ్యవహరిస్తున్నాయని కనకమేడల రవీంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నివేళలా అండగా ఉంటామని విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆయన భరోసానిచ్చారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement