Friday, September 20, 2024

KNL : ఆర్డీఎస్ రోడ్డు కరకట్టకు గండి…

అగసనూరు ప్రజలు అప్రమత్తం
ఉధృతి పెరిగితే ముంపు ఖాయం..

కోసిగి, ఆగస్టు 3 (ప్రభన్యూస్ ) : కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని అగసనూరు సమీపంలో ఆర్డీఎస్ ఆనకట్టకు వెళ్లే కరకట్టకు గండి పడింది. తుంగభద్ర నది వరద నీటి ఉధృతికి శనివారం ఈ గండి పడింది. ఈ వరదనీరు పంటపొలాలలోకి ప్రవేశించటంతో అగసనూరు రైతులు, ప్రజలు, అప్రమత్తం అయ్యారు. ట్రాక్టర్లతో మట్టిని తోలి తాత్కాలిక గండిని పూడ్చి వేశారు. ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏ క్షణంలోనైనా ఆర్డీఎస్ కరకట్టకు గండి పడే అవకాశం ఉందని , రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదే జరిగితే తమ పంట పొలాలతో పాటు, గ్రామాన్నీ తుంగభద్ర ముంచే ప్రమాదం ఉందని అగసనూరు జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అధికారులు వెంటనే స్పందించి గండిని పరిశీలించి శాశ్వతంగా గండిని పూడ్చే చర్యలు చేపట్టాలని అభ్యర్థిస్తున్నారు. గతంలో ఆర్డీఎస్ కుడికాలువ పనులను చేసిన కాంట్రాక్టరు మొదటి కరకట్ట రోడ్డును తొలగించి తనకు అనుకూల విధంగా కొత్త రోడ్డు నిర్మించారని, ఆ రోడ్డు బలహీన పడటంతో గండి పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తుంగభద్ర వరద ఉధృతంగా ప్రవహిస్తోందని, కరకట్ట రోడ్డుకు గండి పడే ప్రమాదం ఎక్కువగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement