Tuesday, November 19, 2024

ఇక ఆర్టీసీలో జిల్లాకో డీటీఎం కార్యాలయం.. జిల్లాల వారిగా డిపోల విభజన

కడప, ప్రభన్యూస్ : జిల్లాల విభజన నేపథ్యంలో అన్ని శాఖలు ఆయా జిల్లా కార్యాలయాలను ఈ తరహాలోనే ఏపీఎస్‌ఆర్టీసీ కూడా విభజన ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఉమ్మడి జిల్లాల నుండి కొత్త జిల్లాలుగా ఏర్పడ్డ జిల్లాలలో వున్న డిపోలను ఆ జిల్లాలకు సంబంధించిన డిపోలుగా పరిగణించింది. రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాల్లో 129 డిపోలను ఇప్పుడు 26 వ జిల్లాల పరిధిలోకి వస్తాయి. వీటికి సంబంధించిన పరిపాలన , నిర్వహణ కోసం జిల్లాకొక డిస్ట్రిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజర్‌ (డిటిఎం) కార్యాలయంను ఏర్పాటు చేయనుంది. గతంలో జిల్లా కేంద్రాల్లో ఆర్టీసీ రిజినల్‌ మేనేజరు(ఆర్‌ఎం) కార్యాలయాలు వుండేవి. వీటి స్థానంలో ఇప్పుడు జిల్లాకోక డిటిఎం కార్యాలయం ఏర్పాటు చేసే ప్రతిపాదనలో ఆర్టీసీ వుంది. ప్రతి పాదనలకు ఆమోదం లభిస్తే పదిరోజుల నుండి రెండు వారాలలోపు ప్రతి ఒక్క జిల్లాలో ఈ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఉమ్మడి 13 జిల్లాలలో 12 ఆర్‌.ఎం. కార్యాలయాలు వుండేవి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కలిపి అప్పట్లో ఒకే కార్యాలయం వుండే రాష్ట్రంలో 12 ఆర్‌ఎం కార్యాలయాలు వుండేవి. ఇప్పుడు ప్రతి జిల్లాకు ఆర్‌ఎం కార్యాలయం స్థానంలో 26 డిటిఎం కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. అప్పట్లో రాష్ట్రమంతా కలిపి నాలుగు జోన్లు వుండగా ప్రస్తుతం కూడా ఆ నాలుగు జిల్లాలకే పరిమితమౌతోంది. కాకపోతే వీటి పరిధిలు మార్చే ప్రతిపాదనలు వున్నట్లు అధికార వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇక డిటిఎం కార్యాలయాల్లో ప్రొవిజినల్లి ఆర్డర్‌ టు సర్వ్‌ క్రింద అధికారులను సిబ్బందినినియమించేందుకు ఉత్తర్వులు అందాయి.


26 జిల్లాలు.. 129 కార్యాలయాలు జిల్లాల విభజనతో 13 నుండి 26 జిల్లాలు అయిన ఈ జిల్లాలలోని 129 డిపోలను ఆయా జిల్లాల పరిధిలోకి తీసుకొచ్చారు. కొత్తగా డిపోల ఏర్పాటు లాంటి ఆలోచనలేవివున్నట్లుగానీ విభజనతో ఏ జిల్లాలోకి చేరిన డిపోలను ఆ జిల్లాల పరిధిలోకి వచ్చే విధంగా ప్రకటించారు. జిల్లాల వారిగా డిపోల వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లాలో 4 డిపోలు, విజయనగరం జిల్లాలో 2 డిపోలు, పార్వతి పురం జిల్లాలో 3 డిపోలు, అనకాపల్లి జిల్లాలో 2, అల్లూరిసీతరామరాజు జిల్లాలో 1, విశాఖ జిల్లాలో 7, కాకినాడ జిల్లాలో 3, కోనజిల్లాలో 4 డిపోలు వున్నాయి. అలాగే ఈస్ట్‌ గోదావరిలో 4, వెస్ట్‌ గోదావరిలో 4, ఏలూరులో 3, ఎన్‌టిఆర్‌ జిల్లాలో 8, క్రిష్ణాజిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 5, పల్నాడు జి ల్లాలో6, బాపట్లలో 4, ప్రకాశం జిల్లాలోకి 5 డిపోలు వచ్చాయి. అలాగే నెల్లూరు జిల్లాలో 7, తిరుపతి జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 5, అన్నమయ్య జిల్లాలో 5, వైఎస్‌ఆర్‌ కడపలో 6, కర్నూలు జిల్లాలో 5, నంద్యాల జిల్లాలో 7,అనంతపురం జిల్లాలో 7, సత్యసాయిజిల్లాలో 6 డిపోలు వున్నాయి. ఈ జిల్లాల్లోని డిపోల నిర్వహణ, పరిపాలన విభాగాలకు సంబంధించి డిటిఎం కార్యాలయాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలో ఆర్టీసీ వుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement