Tuesday, October 8, 2024

AP | రాష్ట్రంలో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు అవాస్తవం…. ప్రభుత్వం స్పష్టత

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యింది. సామాజిక మాద్యమాల్లో రెండు రోజులుగా కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటూ రెండు, మూడు జిల్లాలను రద్దు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ టీమ్‌ స్పందించింది.. కొత్త జిల్లాల ఏర్పాటు, ఉన్న జిల్లాల రద్దు అంశంపై స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ఫ్యాక్ట్‌ చెక్‌ టీమ్ ట్వీట్‌ చేసింది.

రాష్ట్రంలో 26 జిల్లాలు కాస్త 30 జిల్లాలుగా ఏర్పాటు కాబోతున్నాయని.. కొన్ని మార్పులు, చేర్పులు జరగబోతున్నట్లు సామాజిక మాద్యమాల్లో ఓ డాక్యుమెంట్‌ వైరల్‌ అవుతోంది. కొత్తగా మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో కూడా మార్పులు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండు జిల్లాలను రద్దు చేయబోతున్నట్లు జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి.

నూతన జిల్లాల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న జిల్లాలను రద్దు చేస్తారనే ప్రచారంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్‌ చెక్‌ టీమ్‌ స్పందించింది. సామాన్యుడు ఇచ్చిన సలహాను ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటిస్తూ, సమాజంలో అశాంతి రేపడానికి కొంత మంది అల్లరి మూకలు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, అనకాపల్లి జిల్లా రద్దు చేస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవం అని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement