Wednesday, December 4, 2024

AP | అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య

గాజువాక : ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కిరెడ్డిపాలెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమలాపురం ప్రాంతానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మిత కుటుంబాలు బతుకుదెరువు కోసం వలస వచ్చి పీలానగర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నాయి.

ఈ క్రమంలోనే సుష్మిత, దుర్గారావుకు మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తాజాగా తమ ఇళ్లలో పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వారు ఓ అపార్ట్ మెంట్ పైనుంచి దూకేశారు. ఈ దుర్ఘటనలో దుర్గారావు, సుష్మిత అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

మృతులు ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్టు గుర్తించిన పోలీసులు, ఇంట్లో గాజు గ్లాస్, టీవీ రిమోర్ట్ పగిలిపోవడం పోలీసులు గుర్తించారు. మృతురాలు సాయి సుస్మిత కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతుడు ఫోన్ లాక్ అవ్వడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement