Tuesday, November 26, 2024

కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు నిర్వహణ యూనివర్సిటీలివే…

అమరావతి, ఆంధ్రప్రభ; రాష్ట్రంలో నిర్వహించబోయే వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల (కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు) ను ఈ ఏడాది ఏ యూనివర్సిటీ నిర్వహించాలనేదానిపై రాష్ట్ర ఉన్నత విద్య కౌన్సిల్‌ (స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈఏపీ సెట్‌ను జేఎన్‌టీయూ అనంతపురం, ఈ సెట్‌ను జేఎన్‌టీయూ కాకినాడ, పీజీఈ సెట్‌ మరియు ఆర్‌ సెట్‌లను తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ, ఐ సెట్‌ను అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఎడ్‌ సెట్‌ మరియు పీజీ సెట్‌లను విశాఖపట్టణం ఆంధ్ర యూనివర్సిటీ, లా సెట్‌ మరియు పీఈ సెట్‌లను గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఏడీ సెట్‌ను కడప లోని డాక్టర్‌ వైయస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ పరిధిలో నిర్వహింనున్నట్లు పేర్కొంది.

ఈఏపీ సెట్‌కు ప్రొఫెసర్‌ సీ శోభ బిందు, ఈ సెట్‌కు ప్రొఫెసర్‌ ఏ కృష్ణమోహన్‌, పీజీఈ సెట్‌కు ప్రొఫెసర్‌ ఆర్‌వీఎస్‌ సత్యనారాయణ, ఐసెట్‌కు ప్రొఫెసర్‌ పీ మురళీకృష్ణ, ఎడ్‌సెట్‌కు ప్రొఫెసర్‌ కే రాజేంద్ర ప్రసాద్‌, లా సెట్‌కు ప్రొఫెసర్‌ఒ బీ హరి బాబు, పీఈ సెట్‌కు ప్రొఫెసర్‌ పీపీఎస్‌ పాల్‌ కుమార్‌ఒ, పీపీ సెట్‌కు ప్రొఫెసర్‌ ఎన్‌ రమణయ్య, ఆర్‌ సెట్‌కు ప్రొఫెసర్‌ బీ దేవప్రసాద రాజు, ఏడీ సెట్‌కు ప్రొఫెసర్‌ఒ ఈసీ సురేంద్రనాథ్‌ రెడ్డిలు కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement