Monday, November 25, 2024

BREAKING: ఏపీ రాజధానిపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై కేంద్రం మరోసారి క్లారిటీనిచ్చింది. అమరావతి విజభన చట్టం ప్రకారమే ఏర్పాటైందని కేంద్రం తెలిపింది. మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని తెలిపింది. అమరావతే రాజధానిగా 2015లోనే నిర్ణయించిందంది. అమరావతి రాజధానిగా ఏపీ ప్రభుత్వం 2015లోనే నోటిఫై చేసిందని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం క్లారీటి నిచ్చింది. ఏపీ రాజధాని అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున మాట్లాడటం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement