ప్రభన్యూస్ : రూపాయి ఖర్చుకు అణా పైసా ఇస్తే ఎలా..! ఖర్చు పెట్టిన నిధులివ్వరు.. బకాయిలు చెల్లించరు.. విడుదల చేసే అరకొర నిధులకు కూడా అనేక నిబంధనలు.. ఇలా అయితే జాతీయ ప్రాజెక్టు పోలవరం ముందుకు సాగేదె లా..! కేంద్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలనయితే అప్ప గించింది. కానీ..నిధుల విడుదల విషయంలో ఇతర జాతీయ ప్రాజెక్టులకు అనుసరించే విధానాలను అవలంబించటం లేదని జలవనరుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగంగా ఉన్న భూసేకరణ, సహాయ, పునరావాస పనులు, హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాల్వలతో పాటు ఇతర అనుబంధ పనులన్నిటినీ విడివిడిగా చూసి లెక్కకట్టకుండా మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయంపై ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ (పెట్టుబడి పరిమితి) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.
దీనిపై ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పీపీఎ)కు కూడా నివేదిక అందించారు. సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖలు దీనిపై సాను కూలంగానే స్పందిస్తున్నా కేంద్ర ఆర్ధికశాఖ మాత్రం నిధుల విడుదలపై తరచూ పేచీలు పెడుతోందని అధికారవర్గాలు అంటు-న్నాయి. ఈ నేపథ్యంలో నిధుల విడుదలపై తీవ్ర వత్తిడి తీసుకొచ్చే దిశగా అవసరమైన ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital