పెద్దకడబూరు, ప్రభ న్యూస్: మేకడోణ గ్రామానికి చెందిన బోయ నారాయణ కుమారుడు రామకృష్ణ తండ్రితో కలిసి గొర్రెలు కాస్తూ మధ్యాహ్నం భోజనం తరువాత ఎల్లెల్సీ కాలువలో అన్నంతిన్న గిన్నె కడిగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు జారి నీటిలో పడిపోయాడు. ఇది గమనించిన తండ్రి నారాయణ, చుట్టుపక్కల వారు అప్రమత్తం అయ్యేలోగా రామకృష్ణ నీటిలో మునిగి పోయాడు. సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని స్థానిక యువకులతో కలిసి కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు.
ఫలితం లేకపోయేసరికి ఆదోని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. మధ్యాహ్నం 2.30 గంటల నుండి స్థానిక పోలీసు సిబ్బంది, రిస్క్ టీం ఎల్లెల్సీ కాలువని జల్లెడ పట్టినా రామకృష్ణ ఆచూకి దొరకలేదు. వర్షం కూడా అడ్డంకిగా మారింది. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. కుమారుడు కళ్లముందే కాలువలో పడిపోయి కొట్టుకుపోవడంతో తల్లిదండ్రులు శోకిస్తున్న తీరు అందరినీ కంట తడిపెట్టిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital