కర్నూలు – వెల్దుర్తి సమీపంలోని అల్లుగుండు నేషనల్ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కర్నూలు జిల్లాలోని సి బెళగల్ మండల పరిధిలోని కొండాపూర్ కు చెందిన వ్యక్తులు కర్నూల్ నుంచి వెల్దుర్తికి బైక్‌పై వస్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. మృతులు సి.బెళగల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన అడ్డాకుల చిన్న ,అనిల్ కుమార్ గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెలగల్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన అనిల్ కుమార్, చిన్న మునిస్వామి ఇద్దరు కలసి కర్నూలు నుంచి వెల్దుర్తికి ద్విచక్రవాహనంపై వస్తున్నారు. అల్లుగుండు సమీపంలో వీరి వాహనం రహదారి పక్కన ఉన్న ఇనుప దిమ్మెను ఢీకొట్టి పక్కనే ఉన్న ముళ్ల కంపలో పడిపోయారు.
ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. శుక్రవారం ఉదయం తెల్లవారుజామున హైవే పోలీసులు గుర్తించి మృతదేహాలను వెల్దుర్తి ఆస్పత్రికి తరలించారు. అనిల్ కుమార్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్, చిన్న మునిస్వామి ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు.