Thursday, December 19, 2024

AP | కాంగ్రెస్ తీరు అభ్యంత‌ర‌క‌రం.. ఎంపీ బైరెడ్డి శ‌బ‌రి

నంద్యాల బ్యూరో, డిసెంబర్ 19 : దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో గురువారం కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. ఈ పోటా పోటీ నిరసనల్లో ఇద్దరు బీజేపీ ఎంపీలకు తీవ్ర‌ గాయాలయ్యాయి. ఈ సందర్బంగా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదన్నారు. కేవలం షో కోసం పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ నిరసన చేసిందని, కాంగ్రెస్ ఎంపీల వ్యవహారశైలిని అందరూ గమనిస్తున్నారని, ఇలాంటి రాజకీయాలు సరికాదన్నారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ను లోక్ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమాన పరిచేవిధంగా మాట్లాడాడని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో గురువారం నిరసన ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీల నిరసన ర్యాలీకి వ్యతిరేకంగా బీజేపీ ఎంపీలు కూడా పార్లమెంట్ ఆవరణలో నిరసన ర్యాలీ చేశారు. పోటాపోటీ నిరసన ర్యాలీలో ఇద్దరు బీజేపీ ఎంపీలకు బలమైన గాయాలు తగిలాయి.

- Advertisement -

బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగీ తలకు బలమైన గాయం, మరో బీజేపీ ఎంపీ ముకేష్ రాజ్ పుత్ కు కూడా గాయాలు కావడంతో వారికీ వెంటనే నంద్యాల ఎంపీ, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి స్పందించి ప్రథ‌మ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఇద్దరు బీజేపీ ఎంపీలను ఆసుపత్రికి తరలించారు. నంద్యాల ఎంపీ స్పందించిన తీరును పలువురు ఎంపీలు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement