Friday, November 22, 2024

జగన్ చర్యలతో పతనావస్థకు చేరిన ఆక్వారంగం.. అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా రంగం తెలుగుదేశం హయాంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉండిందని.. నేడు జగన్‌రెడ్డి చర్యలతో పతనావస్థకు చేరిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు ఈ సదస్సులో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్‌ సరఫరా చేస్తానని జగన్‌రెడ్డి హామీ ఇచ్చి రైతులను వంచించారని విమర్శించారు. ఇచ్చిన హామీ అమలు చేయకుండా విద్యుత్‌ కోతలతో ఆక్వా రంగాన్ని జగన్‌రెడ్డి నిండా ముంచారని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ చర్యలతో ఆక్వా రైతులకు మద్దతు ధర లభించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ‘‘ఇదేం ఖర్మ.. ఆక్వా రైతాంగానికి’’ పేరుతో రేపు చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో రాష్ట్ర స్థాయి సదస్సు జరగనుందని తెలిపారు. ఈ సమావేశానికి ఆక్వా రైతులు, ఆక్వా రైతు సంఘం నాయకులు హాజరవుతారని చెప్పారు. ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించి ఉద్యమ కార్యాచరణను చంద్రబాబు ప్రకటిస్తారని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement