Thursday, November 28, 2024

AP | 12 రోజుల పాటు అసెంబ్లీ భేటీ.. బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 11వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఉదయం 10గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. నాలుగు నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

ప్రస్తుత ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ నవంబర్ చివరితో ముగియనుండడంతో సమావేశాల తొలిరోజే సమగ్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలను ఈనెల 22వ తేదీ వరకు కొన‌సాగ‌నున్నాయి.

- Advertisement -

తొలిరోజు ఉదయమే రాష్ట్ర కేబినెట్‌ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన తర్వాత‌ శాసన సభలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ను, మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

శాసన మండలిలో ఆర్థికశాఖ బడ్జెట్‌పై మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయంపై మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం సభా వాయిదా పడిన త‌ర్వాత‌ బీఏసీ సమావేశం ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement