Monday, September 30, 2024

రైతులు నష్టపోకూడదన్నదే ప్రభుత్వ ధ్యేయం..

విజయవాడ (ప్రభన్యూస్‌) : రైతులకు మంచి జరగాలనే వారికి తోడుగా ఉండేందుకు వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి జ‌గన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. గులాబ్‌- సెప్టెంబరు 2021 తుఫాను కారణంగా పంట నష్టపోయిన 34 వేల 586 మంది బాధిత రైతులకు రూ.22 కోట్ల పంట నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫానులు, వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు అదే సీజన్లో పరిహారం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు.

రైతులు నష్టపోకూడదన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఏ సీజన్‌ లో జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారం చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌, పలువురు రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. అందుకు సంబంధించి ప్రభుత్వం కోటి తొమ్మిది లక్షల రెండు వేల రూపాయలను 1366 మంది రైతులకు పంట నష్టం ఇన్‌ పుట్‌ సబ్సిడిని మంజూరు చేసిందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement